¡Sorpréndeme!

అయ్యలానే కొడుకు డ్రామాలు చేస్తున్నాడని తలసాని ఫైర్ || Oneindia Telugu

2019-04-13 658 Dailymotion

Telangana minister Talasani Srinivas Yadav made sensational comments on AP CM Chandrababu. Chandrababu shamelessly criticizing KCR for election politics. Thalasani commented Chandra Babu along with Lokesh Babu. Lokesh also doing dramas like his father . We have seen how the son drama has been done in Mangalgiri, Minister Srinivas Yadav criticized.
#telangana
#trsparty
#talasanisrinivasyadav
#apcm
#chandrababu
#lokesh
#kodela

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ తిట్ల దండకం చదువుతున్నాడు . మొన్నటికి మొన్న కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని ఎద్దేవా చేసిన తలసాని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చిల్లరగా మారాడని మండిపడ్డారు . ఇక చంద్రబాబుతో పాటు లోకేష్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని .అయ్య డ్రామా ఎలా చేస్తాడో.. కొడుకు కూడా మంగళగిరిలో డ్రామాలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా మూడు, నాలుగు చోట్ల గొడవలైనట్టు టీవీలో చూశామన్న తలసాని కావాలని చంద్రబాబు దాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు .మొత్తం రాష్ట్రమంతా గందరగోళమైనట్టు చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారన్నారు తలసాని .